కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే అనంతపురం సభ ఏర్పాటు జరిగిందా...కూటమి నేతల్లో పై స్థాయిలో...సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా...తాజా పరిణామాలు చూస్తే ఇలాగే ఉన్నాయి....కూటమి ఐక్యత కొనసాగిస్తూ....ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండా గా సభ జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Kota Srinivas Death : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కోట శ్రీనివాస్ మరణించారు అన్న వార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోట శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. విజయవాడ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. Read Also : RIP Kota…
ఏపీ బీజేపీ అంటే.... ఒకప్పుడు వాళ్ళే కనిపించేవాళ్ళు, ఆ గొంతులే వినిపించేవి. కానీ... సడన్‌గా ఆ స్వరాలు మూగబోయాయి. నాడు మొత్తం మేమే అన్నట్టుగా హడావిడి చేసిన నాయకులు ఉన్నట్టుండి మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారట. దీనిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో. వాళ్ళలో అందరికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గురించి.
మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్డ్ చేశారు. ఆమె పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.…
Vishnuvardhan Reddy: జనసేన, బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఇద్దరు బీజేపీ నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఒకరు పవన్ కల్యాణ్ ని అడిగినా సహకరించలేదని ఆరోపిస్తే.. పవన్ మద్దతు ప్రకటించారంటూ మరో నేత వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.. బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్రలో భాగమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి రక్షణ కల్పించడంలో విఫలమైందని దీనికి నిరసనగా బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ర్యాలీలో జీవీఎల్ నరసింహారావుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. పంజాబ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలకు మూల్యం చెల్లించు కుంటుందన్నారు. Read Also:చేనేతను ప్రొత్సహించడానికి అంగన్‌వాడీలకు…
ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటే వెనక డుగు వేసినట్టు కాదని బీజేపీ ఎమ్మెల్సీ, మాధవ్ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ .. కొందరిని ఒప్పించే ప్రయత్నం బీజేపీ ఏడాదికాలంగా చేస్తూనే ఉందన్నారు. ఆ చట్టాలు లేక పోయినా బయ ట అవి అమల్లోనే ఉన్నాయని, వాటికి కేవలం చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రమే బీజేపీ చేసిందని తెలిపారు. రైతుల మేలు కోస మే ఆ చట్టాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని…
గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయి అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వుండి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతాము అని అన్నారు. ఇక…
ఏపీ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. అందుకు ఉదాహరణ విశాఖలో అత్యంత విలువైన 22 ఆస్తులను తనఖా పెట్టడమేఅన్నారు.. ప్రభుత్వం అప్పులు తీసుకోవడంలో తప్పులేదు.. కానీ, అన్ని కార్పొరేషన్లు దివాళ తీసేల ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు.. రాష్ట్రంలో అన్ని విలువైన భూములు అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించిన మాధవ్.. రాష్ట్రంలో ఆదాయవనరులపై దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని తనఖా పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్టాన్ని అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా…