మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్డ్ చేశారు. ఆమె పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న “మిస్టర్ ఇడియట్” సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదల చేశారు.
READ MORE: Mini Moon: ఈ రోజు రాత్రి నుంచే చంద్రుడికి తోడుగా ‘‘మిని మూన్’’..
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రవితేజ ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారని గుర్తుచేశారు. తనను కూడా ఆయనే ప్రోత్సహించినట్లు తెలిపాడు. అందుకే మాధవ్ ను సపోర్ట్ చేయడం తన బాధ్యతగా భావించానన్నాడు. కాగా.. పెదనాన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని “మిస్టర్ ఇడియట్” చిత్రంహీరో మాధవ్ అన్నారు. ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కొంత సమయం పట్టిందన్నాడు. తాము శాటిస్వై అయిన తర్వాతే రిలీజ్ చేస్తామని భావించినట్లు తెలిపాడు. తన పెదనాన్న లాగానే తనను కూడా ఆదరించాలని కోరారు.