హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని,…
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు,…
తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read Also: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీ…
సీ ఫుడ్ అంటే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. సీ ఫుడ్‌లో ప్రాన్స్ (రొయ్యలు) చాలా రుచిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంతోమంది ఇష్టపడి లాగించేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో రుచికరమైన రొయ్యల కర్రీ తినాలంటే ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ‘shirmply’ రెస్టారెంట్ ప్రత్యేకంగా సిద్ధమైంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసిన ‘shirmply’ రెస్టారెంట్ త్వరలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే మదాపూర్‌లో బ్రాంచీని…
హైదరాబాద్ మాదాపూర్ లోని కారు గ్యారేజ్ లో జరిగిన చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.55 లక్షలు రికవరీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మీ మోటార్స్ కార్ గ్యారేజ్ లో ఈ నెల 9 న దొంగతనం జరిగింది.శ్రీ మోటార్స్ కారు సర్వీసు వర్క్ షాప్ లో ఉన్న 55 లక్షల నగదును దోచుకెళ్ళారు. కారు షో రూమ్లో మెకానిక్ గా పని చేసే వ్యక్తే ప్రధాన సూత్రధారిగా తేలింది.…
హైదరాబాద్‌లోని ఎన్‌కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తతులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్‌కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు గేట్లు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగోట్టారు. Read: ప్యూర్టోరికాకు క్యూలు కడుతున్న అమెరికన్ కుబేరులు… ఇదే కారణం……
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…
మాదాపూర్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతోనే విషయం బయటికి రాకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికేలు నిర్వహిస్తున్న సమయంలో… మమల్ని ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై నే చేయి చేసుకున్నారు ఇద్దరు వాహనదారులు. దాంతో ఈ ఘటన పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అయితే ఆ ఇద్దరి పై కేసు…