హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
https://ntvtelugu.com/nvss-prabhakar-slams-trs-govt-on-drugs/
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీకి చెందిన బాధితులలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. బాధితులలో 11 మంది చిన్నారులు వున్నారు. వారంతా చలి, విపరీత జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. రాత్రి నుంచి గంట గంటకి బాధితులు గంటగంటకి పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళమని చెబుతున్నారు.
15 రోజులు నుంచి నీరు రంగు మారి వాసన వస్తుందని చెబుతున్నారు బాధితులు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. కలుషిత నీరు వస్తుందని చాలా రోజులుగా చెబుతున్నాం అన్నారు బాధితుడు భీమయ్య కుటుంబసభ్యులు. నీళ్ళు వదిలే లైన్ మెన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.
వాటర్ ఫిల్టర్ కొనుక్కోని తాగాలంటున్నారు అధికారులు. ఇవాళేమో ఆ వాటర్ తో స్నానం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇన్ని రోజులు స్నానం చేయవద్దని చెబుతున్నారు. భీమయ్య తో పాటు అతని ఇద్దరి పిల్లలకు నిన్న సీరియస్‌గా ఉందని, వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాం. ఈలోగా భీమయ్య కు వాంతులు ఎక్కువగా అయ్యాయని, ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామన్నారు. ఇదిలా వుంటే.. మాదగ్గరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని, ఇవాళ 43 మంది బస్తీ వాసులకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
సీవియర్ గా ఉన్న వారినే ఆస్పత్రికి తరలిస్తున్నాం అన్నారు. ఫుడ్ లేదా వాటర్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ ఒకే లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. రికవరీ ఆయిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. పిల్లలు తట్టుకోలేక పోతున్నారు, వారి కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ గా ఉన్న వారికి ఐ సీ యూ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గుట్టల బేగంపేట్ బస్తీలో కలుషిత నీరు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. వాటర్ వర్క్స్ ఎండి పై కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.