హైదరాబాద్‌లోని ఎన్‌కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తతులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్‌కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు గేట్లు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగోట్టారు.
Read: ప్యూర్టోరికాకు క్యూలు కడుతున్న అమెరికన్ కుబేరులు… ఇదే కారణం…
ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. అల్లు అర్జున్‌తో ఫొటోలంటూ అభిమానులకు మెసేజ్‌లు రావడంతో తాము ఇక్కడికి వచ్చామని అభిమానులు చెబుతున్నారు. తోపులాట కారణంగా ప్రొగ్రామ్ రద్దైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. ప్రొగ్రామ్ రద్దు కావడంతో గంటల తరబడి గేటు దగ్గర ఎదురుచూస్తున్న అభిమానులు ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు.