అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు.