సాధారణ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికలు ముగిసి ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అంతకన్నా ముందు పూజాకార్యక్రమాలతో దేవుడి ఆశీస్సులు అందుకున్న మంచు విష్ణు బ్యాండ్ దరువుల మధ్య ప్రమాణ స్వీకారోత్సవ వేదిక దగ్గరకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా…