‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజీ, సమీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… దీంతో.. కాసేపు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. ఇక, సమీర్‌పై ఎన్నికల అధికారికి శివబాలాజీ ఫిర్యాదు చేశారు.. ఇక, పోలింగ్ బూత్ పరిసరాల్లో ప్రకాశ్‌రాజ్…
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బెట్టింగ్ రాజాలు కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కోళ్లపై, గుర్రాలపై పందేలు కాసేవాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు, క్రికెట్ వంటి క్రేజీ అంశాలపై బెట్టింగులు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది బెట్టింగ్ రాజాలు సైతం అప్ డేట్ అవుతున్నారు. మీడియాలో ఏ అంశంపై ప్రజలు విపరీతంగా చర్చిస్తూ ఉంటారో అలాంటి అంశాలనే పందెంరాయుళ్లు దృష్టిసారిస్తున్నారు. వాటిపైనే లక్షల్లో పందేలు కాస్తూ జేబులు…
మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు,…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు…
‘మా’ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈమేరకు ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ నెలకోంది. కాగా, ఇదివరకే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే..…
‘మా’ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీవీఎల్ నరసింహారావు సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. ఈ క్రమములోనే ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు. 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం ప్రధానంగా ప్రస్తావించారు సీవీఎల్.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. ఈ రిజల్యూషన్ పాస్…
‘మా’ ఎన్నికలు ఆక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ‘మా’పోటీదారుల హాట్ హాట్ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారగా.. తాజాగా నటుడు నరేష్, మంచు విష్ణు పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నరేష్ మాట్లాడుతూ.. ‘మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఆయననే అయితేనే మాకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. మా మసకబరింది అని కొందరు కామెంట్ చేసినప్పుడు మసక బారలేదని చెప్పాను. ఎవరు పడితే వారు ‘మా’ సీటులో కూర్చుంటే…
నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేయగా, నేడు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్…
నటుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. ఇటీవలే విష్ణు తన ప్యానల్ ప్రకటించారు. తాజాగా ఆయన ఎన్‌టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు తనకే వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా అజెండా, మ్యానిఫెస్టో చూశాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా…