మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు.. ఎన్నికల్లో నాకు ఓటువేసి గెలిపించిన అందరికీ.. నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. అదే సమయంలో..…
‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారు అంటూ ప్రకటించారు ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.. మా రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మా సమాస అసోసియేషన్ లో మంచు విష్ణు పనులకు అడ్డు రాకూడదనే తాను రాజీనామా చేశానని ఈ సందర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా…
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు.. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్ రాజ్.. ఒక ప్యానెల్ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో ప్యానెల్ సభ్యులు లేకుండా.. ఒకే ప్యానెల్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అందుకే రాజీనామా చేస్టున్నట్టు ప్రకటించారు. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తీవ్ర బావోద్వేగానికి గుర్యారు సీనియర్ నటుడు బెనర్జీ… మా ఎన్నికల రోజు జరిగిన పరిణామాలను…
ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు…
మా ఎన్నికల పై పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడారు. రెండు మూడు ఏళ్ళు ఉండే పదవికి కోసం ఒక్కరిని మాటలను అనడం.. అనిపించుకోవడం అవసరమా అని అన్నారు. ఇలా అనుకుంటుంటే ఎదురు వారికీ మనం ఎంత లోకువ అయిపోతాం.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా అని చిరు ప్రశ్నించారు. అసలు సినీ పరిశ్రమలో ఈ వివాదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.. దానికి ఎవరో కారణమో తెలుసుకొని.. ఆ వివాదాలు సృష్టించిన వ్యక్తులను…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి…
ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించినట్టు ప్రకటించారు.. కాగా, ఇప్పటికే మా ఎన్నికల్లో పోలింగ్…
‘మా’ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్ వేయడం గమనార్హం. లోపల సిట్యుయేషన్ చూశారు. ఎలా ఉంది ? ‘మా’ ఎలక్షన్స్ ఎప్పుడూ లేనంతగా హైప్ క్రియేట్ చేశాయి. మొదటిసారి ప్రత్యేర్థులు విమర్శలు కురిపించుకుంటున్నారు. మీరేం అంటారు ?…