మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. అయితే ‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి.. ప్యానల్స్ మాత్రమే కాదు.. సింగిల్‌గా కూడా తాము బరిలోకి దిగుతాం అంటున్నారు సినీ సెలబ్రిటీలు.. ఈ మధ్యే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా జీవితారాజశేఖర్‌పై పోటీచేస్తానని ప్రకటించడం చర్చగా మారింది. ఇక, వ్యక్తిగత విమర్శలు.. వాటికి జీవిత కౌంటర్ ఇవ్వడంతో మా ఎన్నికల ఎపిసోడ్ రసకందాయంగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీ నేత, సీనియర్ నటుడు బాబు మోహన్..…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత , హేమ , సీఐఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్ లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు. సీవిఎల్ నరసింహారావు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది. నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం…
‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’…