మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. ప్రముఖ నటుడు, ‘మా’ వ్యవస్థాపక సభ్యుడు కృష్ణం రాజు నేతృత్వంలో వార్షిక జనరల్ బాడీ సమావేశం (ఏజిఎం) నిన్న జరిగింది. ఏజిఎం రూల్స్ ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఈ సమావేశంలో “మా” అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి పలువురు సభ్యులు 3 తేదీలను ప్రతిపాదించినట్టు సమాచారం. సెప్టెంబర్ 12, 19, 26 తేదీలను సభ్యులు ప్రతిపాదించారు. అయితే సెప్టెంబర్ 13 ఎన్నికలను నిర్వహించడం…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…
ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపించడంతో టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిధులను దుబారా చేస్తున్నారని, రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘మా’ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిందని క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో హేమకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం…
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ రావటంతో అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయింది ప్రస్తుత కమిటీ. దీంతో రకరకాల వివాదాలతో సభ్యుల వ్యాఖ్యలతో ప్రజలలో చులకనువుతూ వస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లోగా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తన కమిటీతో పోటీ సిద్ధం అని ప్రకటించటం… మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు తాము కూడా అధ్యక్షపదవికి పోటీ చేస్తామని ప్రకటించటం…