మా ఎన్నికలు.. లోపల బీభత్సం.. కురుక్షేత్రం జరుగుతోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజీ, సమీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… దీంతో.. కాసేపు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. ఇక, సమీర్‌పై ఎన్నికల అధికారికి శివబాలాజీ ఫిర్యాదు చేశారు.. ఇక, పోలింగ్ బూత్ పరిసరాల్లో ప్రకాశ్‌రాజ్ ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదు వచ్చిందని ఎన్నికల అధికారి తెలిపారు.. మరోవైపు.. ఈ పరిణామాలపై స్పందించిన యాక్టర్ సుమన్.. లోపల కురుక్షేత్రమే నడుస్తుందన్నారు.
అసలు ప్రెసిడెంట్ పోస్టు మహిళలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సుమన్.. మహిళల్లో కూడా సీనియర్లు ఉన్నారని.. తర్వాత ఎన్నికలకైనా.. మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు.. ఇక, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయన్నారు సుమన్. మా ఎన్నికల్లో లోకల్, నాన్‌లోకల్ అనే ఫీలింగ్‌కు అవకాశం లేదు. లోకల్, నాన్‌లోకల్ అనేది లేవనెత్తితే.. మనకు కూడా సమస్య వస్తుంది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి.. తెలంగాణ వాళ్లకు మాత్రం ప్రియార్టి ఇవ్వాలన్నారు. ఇక, పోలింగ్ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు స్పందించిన సుమన్.. లోపల బీభత్సం జరుగుతోంది… కురుక్షేత్రమే జరుగుతోందన్నారు. అంతా యంగ్ స్టార్ట్స్ ఉన్నారు.. వేడి రక్తం కాబట్టి.. అది కామన్ అని.. గతంలోనూ ఇలాంటివి నేను చూసినవే అన్నారు సుమన్..
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!