మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను…
లాక్ డౌన్ తొలగింది. టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ఇది ఓ వైపు చిత్రం… మరో వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గతంగా ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయంది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. ప్రస్తుత కమిటీ కాలపరిమితి ముగిసినా… కరోనా వల్ల ఈ సారి కొత్త కమిటీ ఎంపిక ఆలస్యం అయింది. లాక్ డౌన్ తొలిగిన నేపథ్యంలో మళ్ళీ ‘మా’లో ఎన్నికల…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు…