మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో రెండు నెలలపాటు టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఇటు ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. లోకల్ – నాన్ లోకల్ వివాదం, మా భవనం, పోస్టల్ బ్యాలెట్ వివాదాలతో పాటుగా మహిళా ఆర్టిస్టులు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ఈసారి పోటీదారుల ఫలితంపై ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.. ఓటింగ్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షా పదవి కోసం కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆ చర్చ మరింత వాడివేడిగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ బృందం, మంచు విష్ణు బృందం ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ‘మా’ సభ్యులను ఆకర్షించడానికి తమదైన మార్గాలు అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని ‘మా’ ఎలక్షన్స్ పై చేసిన కామెంట్స్ పై సినీ పెద్దలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు…
ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత , హేమ , సీఐఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్ లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు. సీవిఎల్ నరసింహారావు…
‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…