మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో రెండు నెలలపాటు టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఇటు ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. లోకల్ – నాన్ లోకల్ వివాదం, మా భవనం, పోస్టల్ బ్యాలెట్ వివాదాలతో పాటుగా మహిళా ఆర్టిస్టులు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ఈసారి పోటీదారుల ఫలితంపై ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది.
ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.. ఓటింగ్ కు రెండు రోజులే ఉండడంతో ‘మా’ ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ ఆర్టిస్టులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అయితే గత ఎన్నికల్లో ఆర్టిస్టులు ఎవరు ఓటు వేసేనందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఓటింగ్ పెర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా వుంది. చాలా మంది ఆరిస్టులు దూరప్రాంతాల్లో స్థిరపడటంతో రాలేకపోయారు. అయితే ఈసారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వంటి హేమాహేమీలు పోటీపడుతుండటంతో ఆసక్తి నెలకొంది. గెలుపు కోసం వారు ప్రయత్నిస్తున్న తీరుతో ఆర్టిస్టులకు కూడా ఓటింగ్ లో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఈసారి ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఎన్నికల రోజున చిత్ర నిర్మాతలు, దర్శకులు షూటింగ్స్ జరుపకపోవడమే మంచిదని ఎన్నికల అధికారి వి. కృష్ణమోషన్ కోరారు. పోలింగ్ ఉదయం గం. 8.00 నుండి మధ్యాహ్నం గం. 2.00 వరకూ జరుగనుంది. ఓటింగ్ లో పాల్గొన్నాక షూటింగులకు వెళ్లొచ్చని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను సైతం ప్రకటిస్తామని ఎన్నికల అధికారి వి. కృష్ణమోషన్ తెలిపారు.