ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది.…