Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని…
Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు’’ అంటూ ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు.
Rajiv Gandhi assassination case: దేశ చరిత్రను, దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం. ఈ రోజుతో ఆయన హత్య జరిగి 33 ఏళ్లు గడిచాయి.
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(MDMK) ప్రధాన కార్యదర్శి వైకో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణించడాని ప్రకటించిన 14 ఏళ్ల తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రభాకరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.
Canada sanctions Gotabaya, Mahinda Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది.
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
Rajiv Gandhi Assassination convicts leaves jail: సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై…
Rajiv Gandhi assassination case: దేశ చరిత్రను, దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం. తాజాగా శుక్రవారం ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం రోజు ఆరుగురు దోషులు నళిని, పిఆర్ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్రరాజా, జయకుమార్, శ్రీహరన్ విడుదలయ్యారు.