IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) నిష్క్రమించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లక్నో.. సీజన్ మధ్యలో వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ గెలిస్తే.. పట్టికలో కాస్త పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడానికి కారణం రిషభ్ పంత్ అనే…
గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను భారీ మొత్తాలు వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని ఫ్రాంఛైజీలకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఆటగాళ్లకు గాయాలు కావని తాను చెప్పడం లేదని, కానీ ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను మాత్రం పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి తాను మొగ్గు చూపుతాను అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్…
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించి జట్టుతో కలిశాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేశ్ ఖాన్‌లకు మయాంక్ తోడవ్వనున్నాడు. మయాంక్ తుది జట్టులోకి వస్తే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న శార్దూల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. 2024 ఐపీఎల్‌లో లక్నో…
LSG Vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ముందుగా విడుదల చేసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. నేడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదికూడా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ జరిగింది. కాకపోతే, ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్…
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన సినిమాలు, డేటింగ్ విషయంలో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్ విషయంలో తరచుగా వార్తల్లో ఉంటారు. ఊర్వశి, పంత్ మధ్య సంథింగ్ అంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఊర్వశి కూడా ఓసారి తాను పంత్ కోసం చాలా సమయం వెయిట్ చేశానని స్వయంగా చెప్పారు. చాలాసార్లు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. అయితే…
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.…
ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్‌లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్…
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని శార్దుల్ ఠాకూర్‌కు అదృష్టం కలిసొచ్చింది. అతనిని రూ.2 కోట్ల డీల్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) ఆప్షన్ ద్వారా శార్దూల్‌ను తీసుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్.. ఫస్టాఫ్ సీజన్ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. టోర్నీ మొదటి అర్ధభాగంలో మయాంక్ అందుబాటులో లేకపోవడం లక్నోకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.11 కోట్లకు లక్నో అతడిని రిటైన్ చేసుకున్న విషయం…