IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది. ఇందులో ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వదిలేయడం హైలైట్. అలాగే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్‌లో తీసుకుంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల ఆటగాడు మతీశ పతిరణను రిలీజ్ చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు)ని వేలంలోకి వదిలి పెట్టింది. అలాగే, తాజా సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (రూ. 4.2 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది. కాగా నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ రూ. 110 కోట్లు కాగా, తాజాగా అట్టిపెట్టుకున్న, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను రిలీజ్ చేసిన తర్వాత ఏ జట్టు పర్సులో ఎంత డబ్బు ఉంది? ఆయా జట్లలో ఉన్న ఖాళీలు ఎన్ని? అనేది ఇప్పుడు ఎన్టీవీ వెబ్సైబ్లో చూద్దాం..
Read Also: Cybercrime: బ్రేకింగ్ న్యూస్.. ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లు క్లోజ్.. క్రియేట్ చేసిన చేతులతోనే..
* 10 జట్ల ఫ్రాంఛైజీల పర్సులో వేలం కోసం అందుబాటులో ఉన్న డబ్బు..
ముంబై ఇండియన్స్- రూ. 2.75 కోట్లు
గుజరాత్ టైటాన్స్- రూ. 12.9 కోట్లు
రాజస్తాన్ రాయల్స్- రూ. 16.05 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 16.4 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 21.8 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్- రూ. 22.95 కోట్లు
పంజాబ్ కింగ్స్- రూ. 22.95 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 25.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- రూ. 43.4 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 64.3 కోట్లు
* ఇక, ఏ టీంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?
పంజాబ్ కింగ్స్- 4 ( ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
ముంబై ఇండియన్స్- 5 (ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
గుజరాత్ టైటాన్స్- 5 (నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
లక్నో సూపర్ జెయింట్స్- 6 (నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – 8 (ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
ఢిల్లీ క్యాపిటల్స్- 8 (ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
రాజస్తాన్ రాయల్స్- 9 (ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
చెన్నై సూపర్ కింగ్స్- 9 (నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
సన్‌రైజర్స్ హైదరాబాద్- 10 (ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
కోల్‌కతా నైట్ రైడర్స్- 13 (ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు). అయితే, ఈ ఏడాది జరగబోయే మినీ వేలంలో కేకేఆర్, సీఎస్కే మధ్య గట్టి పోటీ జరగనుంది. ఎందుకంటే, ఈ రెండు జట్ల దగ్గరే అత్యధికంగా పర్సు ఉంది. ఇక, వేలంగా కీలకమైన ప్లేయర్స్ కొనుగోలుకు చెన్నై, కోల్‌కతా మధ్య తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంది.