సోషల్ మీడియా.. కలుపుతుంది.. విడగొడుతుంది .. మంచి చేస్తుంది ..చెడు చేస్తుంది.. ఈ సోషల్ మీడియానే ఇప్పుడు చాలామందికి శత్రువులుగా మారిపోయింది ..ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు.. సోషల్ మీడియా కాపురాలను కూల్చివేస్తుంది. పచ్చని సంసారంలో కూడా సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తరహాలో ఇద్దరు కలిసి…
కొందరి స్త్రీ, పురుషుల ప్రవర్తన కుటుంబ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికాని యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ పెళ్లైన వారు వారిని విడిచి పెట్టి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగ హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత…
ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు…
ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు... వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ... రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు.
ప్రేమకు వయస్సు లేదని అంటారు. ఇది ఏ వయసులోనైనా ఎవరికైనా పుట్టొచ్చు. యూపీలోని కాన్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మధ్య వయస్కురాలు మైనర్ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా తన వయసులో మూడు రెట్లు ఎక్కువ వయసున్న మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ పిల్లలు ఎదురు తిరిగారు. అయినప్పటికీ.. వారి…
బీహార్లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా చదువుకుని ఉన్నత దశకు ఎదగాలని కోరుకుంటారు. అంతే తప్ప చెడిపోవాలని కోరుకోరు. ఇక ప్రభుత్వాలు కూడా చదువులను ప్రోత్సహించి.. ఉద్యోగాలు కల్పించాలి.