నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో…
కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నింటితో పాటు సినిమా పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా రోజులు థియేటర్లు మూతపడడంతో పాటు ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ కుప్పలు తెప్పలుగా వాయిదా పడ్డాయి. రీసెంట్ గా థియేటర్లు రీఓపెన్ కావడంతో వారానికి కనీసం 5 సినిమాల చొప్పున బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. థియేటర్లను మళ్ళీ తెరచినప్పటి నుంచి నిన్నటి వరకు 15 నుంచి 20కి పైగానే సినిమాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 3 సినిమాలు మాత్రమే…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా కథలు ఎలా సాగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సున్నితమైన భావోద్వేగాలే ఆయన సినిమాలకు బలం. ఎంత నెమ్మదిగా చెప్పితే అంతా గట్టిగా హృదయాల్లో నిలుస్తాయనడానికి ఆయన సినిమాలే ఉదాహరణలు. అయితే కొన్నిసార్లు ఆ నిడివే సినిమాకు బలహీనతగా కూడా మారుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కథకు తగ్గట్టుగా సన్నివేశం ఎంత సమయం తీసుకోవాలనే దానిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. అయితే కాలక్రమములో, ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచి…
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…
కథ, కథనం బాగుంటే తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ కి ఏమి ఢోకా లేదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువుచేశాయి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్ల పట్ల అభిమానుల్లో ఆసక్తి వున్నా సరైన సినిమా రాలేదనిది ఓ వర్గ అభిమానుల ఆవేదన.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఒకటి, రెండు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు ఏవి రాకపోవడంతో కాస్త నిరాశగానే…
నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పేలా కన్పించడం లేదు. నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలం వరకు ఈ రెండు సినిమాకు ఓటిటిలో నేరుగా విడుదల అవుతాయంటూ వార్తలు వచ్చాయి. కానీ “టక్ జగదీష్”, “లవ్ స్టోరీ” రెండూ థియేట్రికల్ విడుదలకే మొగ్గు చూపాయి.…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంపై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నా.. సినిమా వాయిదా పడుతుండటంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లో సినిమాలు ఆడుతున్న ఎప్పుడో రావాల్సిన లవ్ స్టోరీ చిత్రం ఇంకా రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ ను అప్డేట్ కోరుతున్నారు. ఇక ఓటీటీ వస్తుందోనన్న అనుమానాలను నిర్మాతలు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు.. లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక…
ఈ యేడాది అక్టోబర్ 13న దసరా కానుకగా రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. కాబట్టి ఈ లోగా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ రెండు వారాల్లో 12 చిత్రాలు విడుదలైపోయాయి. ఈ వీకెండ్ లో మరో పది సినిమాలు వస్తున్నాయి. అలానే ఆగస్ట్ 19కి తమ చిత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ప్రకటించారు. వీటి…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులు…
ఇన్స్టాగ్రామ్లో అరుదుగా ఫోటోలను పోస్ట్ చేసే సాయి పల్లవి తన తాత, అమ్మమ్మ, సోదరితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘ఫిదా’ బ్యూటీ తన తాత 85వ పుట్టినరోజు కోసం సంప్రదాయ చీర కట్టుకుని కన్పించి నిజంగానే అందరినీ ఫిదా చేసేసింది. ఈ వేడుకలో సాయి పల్లవి నీలిరంగు పట్టు చీర ధరించి చాలా సింపుల్ గా ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేడుకలకు సంబంధించి ఆమె తన అమ్మమ్మ, సోదరి చిత్రాలను కూడా పంచుకుంది. ఈ పిక్స్…