Love Jihad: ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణల నేపథ్యంలో పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. ఒక సెలూన్‌ని ధ్వంసం చేశారు. ఒక హిందూ అమ్మాయిని, సెలూన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి బలవంతంగా ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని చెప్పారు.
Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
MP News:మధ్యప్రదేశ రాజధాని భోపాల్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన వైరల్‌గా మారింది. జిల్లా కోర్టు వద్ద ఈ దాడి జరగడం గమనార్హం. హిందూ మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన సమయంలో హిందూ గ్రూపు ఈ దాడికి పాల్పడింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు అతడిని కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో లవ్ జిహాద్ ఉచ్చులో పడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒకరితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసభ్యకర వీడియోలు కూడా రూపొందించాడు. మతం మారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ దీనిని ఖండించడంతో, వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బీహార్‌లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ వలలో ట్రాప్ చేసేందుకు తన పేరు, గుర్తింపును మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు.
లవ్ జిహాద్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ కామప్రాయానికి బలిపశువులను చేసేవారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ అసిస్టెంట్ కొరియోగరాఫర్ పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం అంటూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి పేర్కొన్నారు.