Assam: బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు అస్సాంలోని హిమంత బిశ్వసర్మ సర్కార్ సిద్ధమైంది. దీనికి వ్యతిరేఖంగా అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది. డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడాన్ని ఈ బిల్లు నిషేధించనుంది.
"మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్‌తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురోలా, ఉత్తరకాశీ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి ముంచుకొస్తుందో తెలియడం లేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ నెల 15న మహాపంచాయత్ కు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరకాశీ యంత్రాంతగా ఇందుకు బుధవారం అనుమతి నిరాకరించింది. మహాపంచాయత్ సమయంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు. పురోలా ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Love Jihad : బెంగళూరులో మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ అదే కంపెనీలో పనిచేసే వ్యక్తి తన తప్పుడు గుర్తింపును చెప్పి అమ్మాయిని తన ప్రేమ ఉచ్చులో బంధించాడు.
Love Jihad: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ రాష్ట్ర పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన ఆయన ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో విభిన్న మతాలకు చెందిన వారు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారని.. అయితే లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. కుట్రలో భాగం ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా…
ప్రతి ఆడపిల్ల లవ్ జిహాద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ పేరుతో కేరళ రాష్ట్రంలో 32000 మంది హిందూ ఆడపిల్లను ఇస్లామిక్ దేశాలకు పంపించి వల్లే జీవితాలను నాశనం చేయడం జరిగింది.
Uttarakhand: ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ కి చెందిన హిందూ యువతిని మోసం చేశాడు. మహ్మద్ ఇఖ్లాష్ అనే వ్యక్తి మనోజ్ గా తన పేరు మార్చుకుని ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా అభ్యంతరకర వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మాద్ ఇఖ్లాష్ మనోజ్ గా నటిస్తూ, గురుగ్రామ్ లోని జీడీ గోయెంకా యూనివర్సిటీలో చదువుతున్నట్లు యువతిని…
The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది.
మే 5న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ' చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని "ప్రచార చిత్రం" అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం 'ది కేరళ స్టోరీ' మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను విసిరింది.