ఖమ్మం జిల్లాలోని తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. యువతి కోళ్లపూడి రమ్య ఇప్పటికే పెళ్లైన అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లాడు. పదిహేను రోజులపాటు అక్కడే గడిపారు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు వివాహితుడు నరేష్. యువతి ఎన్నిసార్లు ఫోన్ చేసిన నరేష్ స్పందించలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి వైజాగ్ లాడ్జిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.