Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.
Yuvraj Singh likely to Join BJP ahead of Lok Sabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంది. 400కు పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇటీవలే బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు రాష్ట్రాల్లో చేరికలపై దృష్టిపెట్టారు. నేమ్, ఫేమ్ ఉన్న సెలబ్రెటీలను పార్టీలో చేర్చుకునేందుకు…
Amethi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపి గెలిపించింది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా ఒకేసారి అమేథికి రావడం…
Ayodhya Temple: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదిక బీజేపీ జాతీయ సమావేశం జరుగుతోంది. భారతదేశంలో రాబోయే వెయ్యేళ్లకు రామరాజ్య స్థాపనకు ఇది నాంది పలుకుతూ, అయోధ్య రామ మందిరంపై ఆదివారం బీజేపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ చైతన్యంగా దేవాలయం మారిందని తీర్మానం పేర్కొంది. ‘‘ పురాతన పవిత్ర నగరమైన అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో దివ్యవమైన ఆలయాన్ని నిర్మించడం దేశానికి ఒక చారిత్రక, అద్భుత విజయమని, ఇది భారతదేశంలో రాబోయే 1000 ఏళ్ల రామ…
PM Modi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీయేకు 400పైగా సీట్లు రావాలంటే, బీజేపీ 370 సీట్లు గెలవాల్సి ఉందని ఆయన అన్నారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ అన్నారు. నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే…
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతా సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్నింటికి కలిపి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్(సీఎపీఎఫ్) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్‌లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు.
BJP: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్‌సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన…
INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమిలో విబేధాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఆప్ కూడా అదే దారిలో వెళ్తోంది.