ఈ రోజు లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. మూడో దశ ఓటింగ్ లో రాష్ట్రం కూడా ఉంది. తన కుటుంబంతో సహా అహ్మదాబాద్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాన్య పౌరుడిలా వరుసలో నిలబడి ఓటు వేశారు.
కిషన్ రెడ్డి చెప్పినట్లు రూ. 10 వేల కోట్లను.. ఏ శాఖకు, ఎన్ని నిధులు, ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్నం విడుదల చేయాలి.. నిధుల శ్వేతపత్రంపై అమరవీరుల స్థూపం దగ్గరకు కిషన్ రెడ్డితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
పాకిస్థాన్‌పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30వేల కోట్ల రూపాయల మిత్తిని చెల్లించామన్నారు.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్, రాయ్ బరేలీ నియోజకవర్గాల ప్రస్తావన మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ పోటీ చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు.
లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ మోడీ సర్కార్‌పై బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ క్యాబినెట్‌లో ఇద్దరు (రాజ్‌నాథ్, గడ్కరీ) తప్ప.. మిగతా వారంతా ‘యెస్’ అంటూ తలూపేవారేనని విమర్శించారు.
గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా తరచుగా ప్రశంసిస్తుంటారు. 2019లో దాని అద్భుత విజయం సాధించి మరోసారి ప్రతిభ చాటింది. ఇక్కడ అది వరుసగా రెండవసారి మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది.