ఈ రోజు లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. మూడో దశ ఓటింగ్ లో రాష్ట్రం కూడా ఉంది. తన కుటుంబంతో సహా అహ్మదాబాద్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాన్య పౌరుడిలా వరుసలో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు ప్రజాస్వామ్య పండుగ. బయటకు వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశం అభివృద్ధి చెందుతోంది. ఈరోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేయడం గర్వంగా ఉంది. ఓటు వేయడం అనేది దేశ పౌరులుగా మనమందరి బాధ్యత మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఒక శక్తివంతమైన స్వరం. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీ ఓటు వేయండి. జై హింద్.” అన్నారు
READ MORE: Holiday: మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కాగా.. లోక్‌సభ ఎన్నికల మూడో దశకి ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడో దశలో 17.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8.85 కోట్ల మంది పురుషులు, 8.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 14.04 లక్షలకు పైగా ఉండగా, 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 39,599 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 15.66 లక్షల మంది ఉన్నారు. మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఈ సమయంలో, వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.