సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. పాక్ నేతలతో రాహుల్‌కు ఉన్న సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె రాహుల్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతని శత్రుదేశంలోని మాజీ మంత్రి మెచ్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
READ MORE: Anna Rambabu: జగనన్నను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం
ఈ అంశంపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకూ ఓ కాంగ్రెస్ నాయకుడితో పోరాడాను. కానీ, ఇప్పుడు పాక్ నాయకుడు ఒకరు స్మృతి ఇరానీని ఓడించాలని అన్నారు. వాళ్లు ముందు వారి దేశం గురించి ఆలోచించాలి. వాళ్లు వారి దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు కానీ, అమేథి గురించి ఆందోళన చెందుతున్నారు. నా గొంతు పాక్ నాయకుడి వద్దకు చేరితే ఆయనకు నేను ఒకటి చెప్పదల్చుకున్నా. సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను హతమార్చేందుకు అమేథిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీని స్థాపించాం’ అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి సీహెచ్ ఫవాద్ హుస్సేన్ పొగడ్తలు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రాహుల్ మంచి ఫైర్ మీదున్నాడంటూ రాసుకొచ్చారు. అయితే పాక్ నేత పోస్ట్‌ను రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ఖండించలేదు. దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. రాహుల్‌కు పాక్‌నేతలతో ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందన్నారు. పాకిస్థాన్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఉందని పునరుద్ఘాటించారు. మన సైన్యంపై ఉగ్రదాడులు దాడి చేస్తుంటే, పాకిస్థాన్ నిర్దోషి అని కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ సీఎం అన్నట్లు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రదాడిలో కూడా పాకిస్థాన్ హస్తం లేదని మరో కాంగ్రెస్ నేత చెప్పారని గుర్తు చేశారు.