Lok Sabha Elections 2024: వారసత్వ పన్ను అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. “కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో ఆర్థిక, కులాల సర్వే నిర్వహించాలని చెప్పారని చెప్పాం. ఈ సర్వే ద్వారా అందిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపింది. ఇదిలా ఉండాగా.. ఆర్థికవేత్త గౌతమ్ సేన్, వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. సంపద పంపిణీ పథకం భారతదేశంలో పనిచేయదన్నారు. దాదాపు 12 కోట్ల మందికి మాత్రమే రూ.102 కోట్లకు పైగా ఆస్తులున్నాయని తెలిపారు. అయితే దాదాపు అందరూ తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అదే సమయంలో, ఆస్తి పంపిణీ కారణంగా, దేశంలోని 98 నుండి 99 శాతం ప్రజల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని స్పష్టం చేశారు.
READ MORE: Weather Report : ఏప్రిల్ నెలలో 19వ శతాబ్దపు రికార్డులను బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కాగా.. లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం నెలకొంది. వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం లేపింది. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆయన ఏమన్నారంటే.. “అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. ప్రభుత్వం మిగిలిన 55% తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టం. మీరు సంపదను సృష్టించారు, మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం, ఇది సముచితమని భావిస్తున్నా. దానిని పేదలకు పంచుతాం.” అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!