Polling Started for MP Elections in 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని…
ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సడన్‌గా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చారు.
అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు.
ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం అతడికి సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.