PM Modi: మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాతృదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఊహించని బహుమానం దొరికింది. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో వారికి మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Video viral: వందే భారత్ రైలు కింద చిక్కుకున్న ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు తన తల్లితో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మోడీ.. ఆ చిత్రాలను ఎస్‌పీజీ సిబ్బందికి అందించాలని సూచించారు. అలాగే ఆ చిత్రపటం వెనుక వారివారి చిరునామాలు కూడా రాయాలని సూచించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందన్నారు. పాశ్చాత్య దేశాల్లో మదర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారని, మన దేశంలో తల్లిని నిత్యం దేవతలా కొలుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sreemukhi: శ్రీముఖి పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్.. ఈ ఏడాదే అంటూ?
ఇదే సభలో సందేశ్‌ఖాలీ ఘటనపై ప్రధాని మోడీ తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సందేశ్ ఖాలీ నిందితులను తొలుత పోలీసులు రక్షించాలని చూశారని, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్సే నేరుగా రంగంలోకి దిగిందని దుయ్యబట్టారు. సందేశ్‌ఖాలీలో సోదరీమణులను తృణమూల్ కాంగ్రెస్ గూండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలా ఉంటే బెంగాల్‌కు 5 గ్యారంటీలు మోడీ ప్రకటించారు. తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరన్నారు. అయోధ్యలో రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చలేరని చెప్పారు. రామ నవమి పూజలను చేసుకోకుండా ఆపలేరని… సీఏఏ అమలును అడ్డుకోలేరని ప్రధాని మోడీ బెంగాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీరాముడిని పూజిస్తే తృణమూల్ కాంగ్రెస్ ప్రజలను బెదిరిస్తోందని, రామనవమి వేడుకలకు అనుమతించట్లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణాన్నే వ్యతిరేకించిందని విమర్శించారు. దేశాన్ని అలాంటి వారి చేతిలో పెడదామా అని మోడీ ప్రజలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!