గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Minister Sridhar Babu: రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయలేదు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి.. త్వరలో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు.
CM Revath Reddy:రుణమాఫీ చేశాం.. అయిన రైతులు బాధలు తప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమస్య ఏంటంటే.. కుటుంబం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Deputy CM Bhatti Vikramarka Said Loan Waiver will be completed soon in Telangana: 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.…
Miinister Komatireddy Venkat Reddy on Loan Waiver: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టామని, త్వరలోనే విజయవంతంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగానే పాలన ఉంటుందన్నారు. నేడు గురుపౌర్ణమి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహిచిన వేడుకలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి…
నూతనంగా ఎన్నికైన నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు.