Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభా ప్రాంగణంలోనే కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. లక్షన్నర లోపు బకాయి ఉన్న దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా లక్షన్నర కేటగిరీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణ చేపట్టారు.
Read also: Astrology: జులై 30, మంగవారం దినఫలాలు
ఈ నెల 15న జీవో నెంబర్ 567 జారీ కాకముందే రూ.10 వేల కోట్లు సర్దుబాటు చేసి.. మొదటి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ.6,099 కోట్లు విడుదల చేశారు. మిగిలిన నిధులతో పాటు ఈ నెల 23న రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఫలితంగా రూ. 7 వేల కోట్లు ఖజానాకు గండి పడింది. ఈ నిధులు రెండో విడతకే సరిపోవన్న ఉద్దేశంతో మంగళవారం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డేటా ప్రాసెసింగ్ సమాచారం ప్రకారం… లక్ష నుంచి లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.6,500 కోట్లు సరిపోతాయని అంచనా. 6,500 కోట్లకు సంబంధించిన బిల్లులు సోమవారం సాయంత్రం ట్రెజరీకి చేరాయి. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. రైతుల వివరాలు, వారి ఖాతాలు, జమ చేసిన నిధులను ట్రెజరీకి అందజేశారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు, పార్టీ కార్యకర్తలతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల ఉదయం రెండో విడతలో అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ ప్రకటించనుంది.
Read also: Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ. 6,099 కోట్లు విడుదల చేయగా… 11.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,014 కోట్లు జమయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఆర్‌బీఐ సూచించిన వివరాల ప్రకారం సాంకేతిక లోపాలను సరిచేసి… ఆర్‌బీఐ నుంచి నిధులు రాగానే తిరిగి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సీడెడ్ సొసైటీలు)కు సంబంధించిన రైతుల రుణ ఖాతాలపై తనిఖీలు పూర్తయ్యాయి. ఈ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. మంగళవారం తర్వాత రెండు విడతల్లో రుణమాఫీ కింద 18.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,600 కోట్లు జమకానున్నాయి. మూడో విడతలో ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను ఆగస్టు నెలలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కల్వకుర్తి సభలో ప్రకటించారు. మూడో దశలో రైతుల సంఖ్య, రెండో దశ కంటే రెట్టింపు నిధులు వచ్చే అవకాశం ఉంది.
Gottipati Ravi Kumar: ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది.. రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి హర్షం