రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు.
రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు…
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యాయి.
రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు.
రాష్ట్రంలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం అయిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ లో భాగంగా రుణమాఫీ చేసారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేసారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ చేసారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.50…