CM Revath Reddy: రుణమాఫీ చేశాం.. అయిన రైతులు బాధలు తప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమస్య ఏంటంటే.. కుటుంబం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. అగ్రికల్చర్ ఇజ్ అవర్ కల్చర్ అన్నారు. కుటుంబంలో ఒకరిద్దరు వ్యవసాయం చేయండి.. మిగిలిన ఒకరిద్దరు నైపుణ్యం పెంచుకుని పరిశ్రమలు పెట్టాలని తెలిపారు. ఒకప్పుడు కృష్ణ జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో పది ఎకరాలు వస్తుందన్నారు. చైనా తో పోటీ పడి గొప్పగా ఎదగొచ్చని తెలిపారు. ప్రభుత్వం విధివిధానాలు మీకు చెప్పాలి అని అనుకున్నామన్నారు. పశ్రమలు పెట్టీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పీవీ ప్రధాని అయ్యాకా.. సరళీకృత విధానాలు వచ్చాయన్నారు. ప్రపంచం తో పోటీపడేలా చేశారన్నారు. పీవీ తర్వాత మంథని నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవాళ పాలసీ రెడీ చేశారన్నారు.
Read also: BRS Office: బీఆర్‌ఎస్ ఆఫీసును కూల్చేయండి.. 15 రోజులు టైం ఇచ్చిన హైకోర్టు..
పాలసీ లేకుండా ప్రభుత్వం నడవదన్నారు. ఇన్సెంటివ్ లు..గత ప్రభుత్వం ఇచ్చిన హామీ లు మేము చెల్లిస్తాం మని తెలిపారు. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసేస్ అన్నారు. చంద్రబాబు తెచ్చిన ఐటి నీ..అంతకంటే ఎక్కువ వేగంగా వైఎస్ అభివృద్ధి చేశారు కాబట్టే.. ఇంత అభివృద్ధి చెందిందని తెలిపారు. కొవిడ్ కాలం లో మూడు వ్యాక్సిన్ లు ఇక్కడే తయార్ అయ్యాయి అన్నారు. ఐటి నీ తెచ్చింది..అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అన్నారు. పరిపాలన విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లీక్ అన్నారు. మంచి పని కొనసాగిస్తాం.. విఘాతం కలిగించే అంశాలు ఉంటే తొలగిస్తాం అన్నారు. విద్యార్దులు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు అని తెలిపారు. కానీ ఉద్యోగం కి వచ్చేసరికి.. సర్టిఫికెట్లు అక్కరకు రావడం లేదన్నారు. స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారు. అందుకే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ కింద్రాలు గా మార్చ బోతున్నం అన్నారు. రేపు పారిశ్రామిక వేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం అవుతారని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏం లేదన్నారు.
Kamareddy School Bus: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ.. బస్సులో 50 మంది స్టూడెంట్స్..