Liquor Scam: ఢిల్లీలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఢిల్లీ తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ… ఆందోళనలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా, ఇటీవల కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందంటూ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని బండి సంజయ్ అన్నారు. చట్ట సభల్లో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదన్నారు. కవిత మొదట ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలన్నారు.మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తే బాగుండేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, బీఆర్ఎస్ చర్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కావాలనే కుట్రపూరితంగా ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ విమర్శించారు.
Also Read
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
మరోవైపు కవితకు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిపై బై బై మోదీ అని రాశారు. ఆరోపణలు ఎదుర్కొనే వారు బీజేపీలో చేరగానే… ఆరోపణలన్నీ పోతాయని ఆ పోస్టర్లలో సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!