today events March 12, 2023
* విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
* తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు రేపు పోలింగ్.. ఈ నెల 16న కౌంటింగ్
*నేడు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రాజ్యాంగ వ్యవస్థలు- పరిరక్షణపై సదస్సు, హాజరుకానున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్
* గుంటూరులో నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 500 మీటర్ల పొడవు వైసీపీ జెండాతో భారీ ర్యాలీ ….40 కేజీల భారీ కేక్ ను కట్ చేయనున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు
*గుంటూరులో నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 500 మీటర్ల పొడవు వైసీపీ జెండాతో భారీ ర్యాలీ ….40 కేజీల భారీ కేక్ ను కట్ చేయనున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు
*నేడు సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి కడపకు బయలుదేరిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి
* విశాఖలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓపెన్ డిబేట్….ఉత్తరాంధ్ర విద్యావంతుల వేదిక నిర్వహిస్తున్న ముఖాముఖిలో మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్న అభ్యర్థులు
* కోడుమూరు మండలం శ్రీ గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో నేడు పల్లకిసేవ
* మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థులు నేడు మధ్యారాధన….పీఠాధిపతులు బృందావనానికి పాలతో అభిషేకం, మహా పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు…..స్వామి వారి ప్రతిమను నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు
* కర్నూలులో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టర్ కోటేశ్వర రావు
* కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ తెల్లటి ఐరావతంప్తె దర్శనమివ్వనున్న శ్రీవారు
* నేడు సికింద్రాబాద్ లో సి ఐ ఎస్ ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్… పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*26వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం.. ఈరోజు బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర ఫర్ చేంజ్
*నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన..కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొనున్న మంత్రి తలసాని