AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో,…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది..
లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి..
ఛార్జిషీట్‌లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్‌షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని…
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుల అరెస్టులపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగతా నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.