ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.. లిక్కర్ స్కాంలో సాక్షిగా హాజరుకావాలని విజయసాయిరెడ్డి గతంలో నోటీసులు జారీ చేసింది సిట్.. దీంతో, విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. అయితే, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి.. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారట..
లిక్కర్ స్కాంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇక, ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే..
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్…
Arvind Kejriwal: లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇంకా ఊరట దొరకలేదు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి బెయిల్‌గా మార్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ…
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తప్పుడు కేసులు బనాయించి ప్రజాప్రతినిధులను, నేతలను వేధింపులకు గురిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో సంచలన వాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శించున్న ఆయన..…
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా పిలిచి విచారణ జరిపారు. రాఘవరెడ్డికి ఎదురుగా అరుణ్ రామచంద్రపిళ్లైని కూర్చోబెట్టి ఇద్దరిని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ నిరాకరించింది… ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి,…