New Bars Tenders: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ పాలసీపై పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు వచ్చినవి కేవలం 90 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఉచిత ఎన్‌రోల్మెంట్ అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం, టెండర్లలో పాల్గొనేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారులను ఆకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం. రేపటితో దరఖాస్తుల గడువు ముగియనుండటంతో పరిస్థితి…
ఢిల్లీ లో జరిగిన స్కామ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్‌లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా విజయసాయిరెడ్డిపై, అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ మాఫియా, డిస్టిలరీ ఆర్డర్లు, లిక్కర్ అమ్మకాలపై చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను తెలిపారు. జగన్ మాట్లాడుతూ.. ఏ లిక్కర్ కంపెనీ డిస్టలరీ మేలు చేయాలో ప్రైవేట్ షాపుల పేరుతో వీళ్ళ ప్రైవేట్ సైన్యం ఇండెంట్ ప్లేస్ చేస్తారన్నారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా చూసారా? గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదనంగా…
మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు.
ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీఅమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
TS Excise Department: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రచారం తారాస్థాయికి చేరనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.