జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇవాళ కూడా సభలో మద్యం పాలసీపై అసత్యాలు చెప్పి జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలను కించపరిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సభలో సీఎంకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలేకే తమ సభ్యులు చిడతలు వాయించారని తెలిపారు. పాలసీని మార్చి దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 దుకాణాల్లో మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని…
ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని…
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్‌లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also: Petrol Prices: సామాన్యులకు…
మద్యం పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. కొత్త మద్యం పాలసీపై కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఒకటి రెండు రోజుల్లో మద్యం పాలసీ ఖరారు చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. కసరత్తు పూర్తి అయిన తర్వాత వైన్ షాపులకు టెండర్ల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎక్సైజ్ శాఖ.. కొత్త మద్యం పాలసీ 2021 డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుండగా… 2023 నవంబర్ 30వ తేదీతో ముగియనుంది.. అయితే,…
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ…