New Bars Tenders: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ పాలసీపై పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు వచ్చినవి కేవలం 90 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఉచిత ఎన్‌రోల్మెంట్ అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం, టెండర్లలో పాల్గొనేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారులను ఆకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం. రేపటితో దరఖాస్తుల గడువు ముగియనుండటంతో పరిస్థితి మరింత కీలకంగా మారింది.
iPhone 16 Price Drop: 35 వేలకే ‘ఐఫోన్ 16’.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు భయ్యో!
ఇక జిల్లాలవారీగా పరిస్థితి చూస్తే.. 8 జిల్లాల్లో ఒక్క దరఖాస్తూ రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో అనంతపురం, అనకాపల్లి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, మణ్యం జిల్లాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 110 బార్లకు 12 అప్లికేషన్లు, ఎన్టీఆర్ జిల్లాలో 130 బార్లకు 12 అప్లికేషన్లు, విజయవాడ-కృష్ణా జిల్లాలో 39 బార్లకు 13 అప్లికేషన్లు, పల్నాడు జిల్లాలో 49 బార్లకు 10 అప్లికేషన్లు అందాయి. కర్నూలు జిల్లాలో 23 బార్లకు 8 అప్లికేషన్లు, విశాఖ జిల్లాలో 121 బార్లకు 5 అప్లికేషన్లు, ప్రకాశం జిల్లాలో 26 బార్లకు 5 అప్లికేషన్లు, విజయనగరం జిల్లాలో 28 బార్లకు 5 అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా చిత్తూరు, ఎలూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Viral News: ఒంటిపై పాము.. భయంతో యువకుడు ఏంచేశాడంటే? చివరలో ఊహించని ట్విస్ట్