Lionel Messi: ప్రస్తుత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరైన లియోనెల్ మెస్సీ దాదాపు దశాబ్దం తర్వాత భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కానీ, అధికారికంగా మెస్సీ నుంచి అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పుడైనా తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఈ టూర్‌లో కొల్కతా, అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలు భాగంగా ఉండనున్నాయి. అతని పర్యటన చివర్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కూడా షెడ్యూల్‌లో ఉంది. అయితే, భారత్ లో ఫుట్బాల్ కు పేరుగాంచిన కేరళలో స్టాప్ లేదని సమాచారం. ఇకపోతే, మెస్సీ భారత టూర్‌లో తొలి అడుగు కోల్కతాలో పడనుంది. డిసెంబర్ 12 రాత్రి 10 గంటల ప్రాంతంలో చేరనున్న మెస్సీ, అక్కడ రెండు రోజుల పాటు ఉండనున్నారు. ఇది అతని టూర్‌లో అతి పెద్ద స్టాప్.
Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?
ఇక డిసెంబర్ 13న కోల్‌కతాలో ఉదయం 9 గంటలకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత లేక్ టౌన్ శ్రీభూమి, VIP రోడ్ వద్ద 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేపట్టనున్నారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మెస్సీ విగ్రహం అవుతుందని నిర్వాహకుల అంచనా. ఆ తర్వాత మధ్యాహ్నం 12 – 1:30 మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో సౌరవ్ గంగూలీ, లీండర్ పేస్, జాన్ అబ్రహాం, భైచుంగ్ భూటియా తదితరులతో మెస్సీ 7-ఏ-సైడ్ మినీ గేమ్‌లో పాల్గొంటాడు. ఈ మ్యాచ్ కు మొత్తం 68,000 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మ్యాచ్ వీక్షించాలంటే టికెట్ ధరలు రూ.3,500 పైగా ఉండే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెస్సీకి సత్కారం చేయనున్నారని సమాచారం.
Ram Charan: శ్రీరాముడిగా రామ్‌చరణ్? మహావతార్ నరసింహ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్, ముంబయి నగరాలలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ లలో ఆడనున్నారు. ఇక ముంబై ఈవెంట్ లో ఇండియన్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు (సునీల్ ఛేత్రి తదితరులు)తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక చివరగా డిసెంబర్ 15న న్యూఢిల్లిలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇక “కేరళలో ఎలాంటి ఈవెంట్ లేదు” అని తేల్చిచెప్పారు. ఇదివరకు 2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి ఇండియా వచ్చాడు. కోల్కతాలో వేనిజువెలాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. అప్పుడు మెస్సీకి జరిగిన స్వాగతం ‘మెస్సీ ఫీవర్’గా మారింది. 75,000 మంది సామర్ధ్యంతో సాల్ట్ లేక్ స్టేడియం కిక్కిరిసిపోయింది.