Virat Kohli earnings RS 11.45 Crore for a Single Instagram Post: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. కేవలం క్రికెట్ ఆటలోనే కాదు.. సోషల్ మీడియానూ తాను కింగే అని మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోట్లు ఆర్జిస్తున్నాడు.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా క్రికెట్, తన వ్యక్తిగతంకు సంబందించిన వివరాలు పోస్ట్ చేస్తుంటారు. మరోవైపు యాడ్స్ కూడా పోస్ట్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ.. ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నాడట. ఈ మేరకు ఓ నివేదిక పేర్కొంది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయుడిగా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.
Also Read: Funny Viral Video: బాసూ.. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండాలి! అశ్విన్ కూడా ఏం..
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 20వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో ఉండగా.. అతని ప్రధాన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు వసూల్ చేస్తుండగా.. మెస్సీ 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కోహ్లీనే కావడం విశేషం.