FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా, యువ ఆటగాళ్లతో బలంగా ఉన్న స్పెయిన్ జట్టు మధ్య జరగనున్న ఈ తుది సమరానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఈస్ట్ రదర్ఫోర్డ్లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జూలై 20న ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 గంటలకు మొదలు కానుంది.
కొత్త చరిత్ర:
టికెట్ రీసేల్ ప్లాట్‌ఫామ్ TickPick వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌కు సగటున 11,327 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు) చెల్లిస్తున్నారు. అమెరికా క్రీడా చరిత్రలో ఏ క్రీడా ఈవెంట్‌కైనా నమోదైన అత్యధిక సగటు టికెట్ ధర ఇదేనని TickPick తెలిపింది. నిజానికి అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా ఈవెంట్‌గా భావించే Super Bowl LVIII టికెట్ ధరల రికార్డును కూడా ఈ ఫిఫా ఫైనల్ అధిగమించింది. ఆ మ్యాచ్‌కు సగటు టికెట్ ధర 9,411 డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) ఉండగా.. ఇప్పుడు ఫిఫా ఫైనల్ దానికంటే ఎక్కువ ధరతో సరికొత్త రికార్డు సృష్టించింది.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
చౌక టికెట్ రూ.6.7 లక్షలు:
ఈ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలంటే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిందే. TickPickలో అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర టికెట్ కూడా 6,943 డాలర్లు (సుమారు రూ.6.7 లక్షలు)గా నమోదైంది. అయినప్పటికీ టికెట్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదని సమాచారం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఒకవైపు స్పెయిన్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మరోవైపు లియోనెల్ మెస్సీ వరుసగా రెండో ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచి తన అద్భుత కెరీర్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చాలని భావిస్తున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మొత్తం ఈ మెగా ఫైనల్ పైనే నిలిచింది.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!