జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం…
Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం…
సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు.
Pranay Case Judgement: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత…
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ…
Kolkata Hospital Case : ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. శనివారం ఈ కేసులో సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
ఉత్తరప్రదేశ్లో ఆరేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురైన చందన్ గుప్తా కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 28 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.