అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు, ఎలుగుబంట్ల, ఏనుగులు జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల అలజడి జనానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ చిరుత పులి అలజడి కలిగిస్తోంది. గాలివీడు మండలం అరవీడు గ్రామం నడింపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి హల్ చల్ చేసింది. మేతకు అడవికి వెళ్ళిన మేకల మంద పై దాడి చేసి రెండు మేకలను చంపింది చిరుత పులి. దీంతో ప్రాణ భయంతో అటవీ ప్రాంతం నుంచి ఇండ్లకు పరుగులు తీశారు మేకల్ని మేతకు తీసికెళ్ళిన కాపరులు.
గత మూడు రోజుల నుండి అరవీడు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని పశువుల కాపరులు చెబుతున్నారు. మేకల మందపై చిరుత పులి దాడి చేయడంతో ఆందోళనలో వున్నారు గ్రామస్థులు. చిరుత పులి దాడిలో మృతి చెందిన మేకలను పరిశీలించారు అటవీశాఖ అధికారులు. యజమానులకు నష్టపరిహారం చెల్లించే అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. చిరుత పులి ఆచూకీ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు అటవీ శాఖ అధికారలు. చిరుత పులి ఆచూకీ త్వరగా కనుగొనాలని, తమ భయాందోళనలు కొనసాగించాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలోనూ మూడువారాలకు పైగా బెంగాల్ టైగర్ వణికిస్తోంది.
కాకినాడ జిల్లాలో పులి కోసం గాలింపు చర్యలు 28 వరోజుకి చేరుకున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం శరభవరం గ్రామంలో సూరవరం కొండ పక్క పొలంలో మరొక ఆవుదూడపై దాడి చేసింది పులి. దీంతో భయబ్రాంతులకు గురవుతున్నారు పరిసర ప్రాంత గ్రామస్థులు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అటవీశాఖ అధికారులు.
AP Film Chamber: టికెట్ల అమ్మకాలు, ఆదాయంపై ఏపీ సీఎంకి లేఖ