కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో వన్యమృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ ఖాళీగా మారిపోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం తగ్గిపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతున్నది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు.
Read: ఆ షో భవిష్యత్తు ప్రశ్నార్థకం: గూగుల్, ఫేస్‌బుక్ బాటలో మైక్రోసాఫ్ట్ కూడా…
అలా మొరుగుతున్న ఆ కుక్క సడెన్‌గా అక్కడి నుంచి పరుగులు తీసింది. వెంటనే ఓ చిరుత వీధి గేటు దూకి లొనికి వచ్చి చిరుతను నోట కరుచుకొని వచ్చిన దారిన వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను పర్విన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది తమ పెంపుడు జంతువుల మెడకు పదునైన ముళ్లు కలిగిన బెల్టులు తగిలిస్తున్నారు.
See that leopard. Others don’t stand a chance. Via WA. pic.twitter.com/Ha3X9eBwWl
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021