Tiger Fear: బాబోయ్ పులి.. కంటిమీద కునుకులేని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులుల సంచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది..ఏజెన్సీ ప్రాంతాలకు తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది..ఆదిలాబాద్ జిల్లాలో చిరుత,కొమురం బీం మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ,బజార్ హత్నూర్ మండలంలోని పలు గ్రామశివారులలో చిరుత సంచారం కలకలం రేపుతోంది..ఏప్రీల్ నెల నుంచి ఈరెండు మండలాలతోపాటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపిస్తోంది…తాజాగా బోథ్ మండలం జీడిపల్లె శివారులో ఓ రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది చిరుత..అంతకంటే ముందు బజార్ హత్నూర్ మండలం భూతాయి బీ గ్రామ శివారులో రెండు ఆవులపై దాడి చేసింది చిరుత.ఇందులో ఒక్క ఆవు చనిపోయగా మరో ఆవు చావుబతుకుల్లో ఉంది.
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
అటవీ ప్రాంతంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో చిరుత జనం కంటపడుతుండగా భయాందోళనకు గురౌతున్నారు జనం. పంటపొలాల వైపు వెళ్ళాలంటే భయమేస్తోందంటున్నారు రైతులు. ఇదిలా ఉంటే కొమురం భీం జిల్లాలో ఇటీవల పులి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది..పెంచికల్ పేట మండలం గుండెపల్లి అటవీప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది..దీనికి తోడు ఇదే మండలంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం, ఆవులపై దాడి చేయడంతో జనం భయపడిపోతున్నారు.
ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది..మండలంలోని ఎడగట్ట, మల్లంపేట, కొటపల్లి, పారుపల్లి గ్రామాలలోని సమీప అటవీ ప్రాంతాలలో వారం రోజుల నుండి పులి సంచరిస్తోంది…పులి కదలికలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు..పులి సంచారంలో జనం భయాందోళనకు గురౌతున్నారు. దీంతో గ్రామాల్లో దండోరా వేయించి పులి కదలికలు ఉన్నాయని జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు…పైగా అటవీ ప్రాంతం వైపు పశువులను తీసుకెళ్ళవద్దని చాటింపు చేయిస్తున్నారు.
మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పులి కొద్ది రోజులుగా వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తుండగా రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం అటవీప్రాంతాల వైపు వెళ్ళవద్దని, పశువులను సైతం అటువైపు పంపించవద్దని చెబుతున్నారు..దీంతో పాటు పులి రక్షణ కోసం చర్యలు చేపట్టామని వివరిస్తున్నారు. ఏది ఏమైనా అటు పులి….ఇటు చిరుత సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేయడమే కాదు పశువులపై పంజా విసురుతున్నాయి..అధికారులు మాత్రం వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెబుతున్నారు..జనం అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు..గతకొంతకాలంగా పులి సంచారం లేకుండా ఉన్న ఏరియాల్లో మళ్లీ పులి కదలికలు కనిపిస్తుండగా జనం భయంగుప్పిట్లో ఉంటున్నామంటున్నారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!