సాధారణంగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్…